TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన అక్షర..!

Hyderabad : అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన అక్షర..!

హైదరాబాద్, మన సాక్షి:

హైదరాబాద్ రాంనగర్ నివాసి, ఆత్మకూర్ గ్రామానికి చెందిన యాతాకుల కుటుంబపు ముద్దుబిడ్డ అక్షర మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. పట్టుదలతో కృషి చేస్తూ, మెడికల్ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి, రెండో దశ కౌన్సెలింగ్‌లో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ (CMRM)లో ఎంబిబిఎస్ సీటు సంపాదించింది.

యాతాకుల మంగమ్మ మనుమరాలు – చిన్నప్పటి నుంచే ప్రతిభ, యాతాకుల మంగమ్మ చిన్నకొడుకు అశోక్–ఉపేంద్రల కుమార్తె అక్షర, విద్యాభ్యాసంలో చిన్నప్పటి నుంచే ప్రతిభను ప్రదర్శించింది. కష్టపడి చదువుతూ NEET పరీక్షలో 360 మార్కులు, 2,92,382 ర్యాంక్ సాధించి వైద్యవిద్యలో అడుగుపెట్టే అవకాశం సొంతం చేసుకుంది. అక్షర విజయంతో ఆత్మకూర్ గ్రామానికి మరో మెడికల్ సీటు రావడం గ్రామ ప్రజలకు గర్వకారణంగా మారింది.

గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “అక్షర కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈ విజయానికి మూలం” అని అభిప్రాయపడ్డారు.డాక్టరై సమాజానికి సేవ చేయాలన్న అక్షర సంకల్పం.

అక్షర మాట్లాడుతూ “నేను సాధించిన ఈ మెడికల్ సీటు వ్యక్తిగత విజయమే కాదు, నా కుటుంబం, నా గ్రామం, నా సమాజం కోసం సాధించిన విజయమని భావిస్తున్నాను. మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు, గ్రామానికి సేవ చేయడం నా లక్ష్యం” అని తెలిపింది.

కుటుంబ సభ్యుల ఆనందం, ప్రజల ఆశీర్వాదాలు, అక్షర సాధనతో యాతాకుల కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కుటుంబసభ్యులు ఆమె మరింత ఎత్తులకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు ఆమె విజయాన్ని ఘనంగా స్వాగతిస్తూ, భవిష్యత్తులో డాక్టరుగా వెలుగొందాలని ఆశీర్వదించారు.

MOST READ : 

  1. Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!

  2. Sand : ఇసుక ర్యాంపులపై అధికారుల దాడులు.. తెప్పలు ధ్వంసం, మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్..!

  3. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

  4. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

మరిన్ని వార్తలు