Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం.. బాలుడిని కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి, బాలుడు గల్లంతు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం.. బాలుడిని కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి, బాలుడు గల్లంతు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల గ్రామంలోని దసరా పండుగ పూట దిండి వాగులో జరిగిన హృదయవిదారక సంఘటనలో గురువారం ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించబోయిన ఇద్దరు యువకులు మృత్యువాత పడగా గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. తెనాలి నుండి వచ్చన వారు పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన వీరు దిండి వాగు వద్ద ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
దిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు 10 సంవత్సరాల బాలుడు సాయి ఉమాకాంత్ వాగులో పడి కొట్టుకుపోతుండగా, అతడిని కాపాడటానికి ఇద్దరు యువకులు సాహసించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు కూడా వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు.
మృతులుగా గుర్తించిన వారి వివరాలు రాము (30 ), ఎంబీబీఎస్ విద్యార్థి, గోప (21 ), గుర్తించారు. గల్లంతైన సాయి ఉమాకాంత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. బాలుడి కోసం స్థానిక ప్రజలు, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో దేవరచర్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బంధువుల ఇంట పండుగకు వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిన యువకుల మరణం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Hyderabad : అంకుటిత దీక్షతో మెడికల్ సీటు సాధించిన అక్షర..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!
-
Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!









