Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం
Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!

Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!
కొల్చారం, మన సాక్షి :
కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలోని రైతులతో ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ, కంకి నల్లి ఉధృతి గమనించడం జరిగిందని రంగంపేట వ్యవసాయ విస్తీర్ణ అధికారి రాజశేఖర్ గౌడ్ తెలిపారు. రైతులకు సలహాలు, సూచనలు చేశారు.
వరి పైరులో దోమ ఉధృతి గమనించిన వెంటనే తూర్పు పడమర పాదులు తీసుకోవాలని అలాగే నివారణకు పైమెట్రోజన్ 120 గ్రాములు ఎకరాకు ప్లస్ వేప నూనె 5ml ఫర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
అలాగే కంకినెల్లితో గింజలు రంగు మారడం వంటివి గమనిస్తే స్పైరో మెసిఫిన్ 250 మిల్లీలీటర్లు ఎకరాకు, ప్రోపీ కొనజోల్ 200 మిల్లీలీటర్లు ఎకరాకు కలిపి పిచికారి చేసుకొని పైన తెలిపిన పురుగులను తెగులను అదుపులో ఉంచుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
MOST READ :
-
కోడిపందాలపై డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్..!
-
Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!
-
Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. మహిళా ఆటో డ్రైవర్లు ఆదర్శంగా నిలవాలి..!









