Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

ICDS : పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన..!

ICDS : పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన..!

కంగ్టి, మన సాక్షి :

పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత రాథోడ్ అన్నారు. శుక్రవారం కంగ్టి మండల తడ్కల్ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో తడ్కల్ అంగన్వాడి సెక్టార్ల టీచర్లు హాజరై పోషణ మాసం , జాతీయ పోషణ అభియాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ సుజాత రాథోడ్ హాజరై మాట్లాడుతూ.. అంగన్వాడీల ద్వారా అందుతున్న సేవలపై అవగాహన కల్పించాలని గర్భిణులు,బాలింతలు, చిన్నారులకు, సరైన పౌష్టికాహరం అందేలా చూడాలన్నారు. అనంతరం గర్భవతులకు సీమంతం కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించి, గర్భిణులకు పసుపు, కుంకుమ, స్వీట్లు, పూలు, పండ్లు, చీర, గాజులతో సాంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించారు.

అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోషక ఆహార పదార్థాలు,ఆకుకూరలు, చిరుధాన్యాలు, స్వీట్లు, పిండి పదార్థాలతో తయారుచేసి వంటకాలు తదితర పోషక పదార్థాలతో స్టార్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు విఠబాయి, సువర్ణ, ప్రేమల, భారతిబాయి, సెక్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లు, బాలింతలు, గర్భిణీలు పిల్లలు, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. District collector : విధుల పట్ల నిర్లక్ష్యం.. జిల్లా కలెక్టర్ సీరియస్, ప్రిన్సిపాల్ కు షోకాజ్..!

  2. Paddy : వరి లో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులపై బెంచ్ మార్క్ శాస్త్రవేత్తల సర్వే..!

  3. TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

  4. Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ధాన్యంకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్..!

మరిన్ని వార్తలు