TG News : తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణం..!

TG News : తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణంగా జరిగింది. బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ పిలుపులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు, బీసీ కుల సంఘాలు, ప్రజాసంఘాలు తమ తమ శ్రేణులతో మొత్తఓ 33 జిల్లాల్లో చురుకుగా పాల్గొన్నాయు. ఆర్టీసీ బస్సులు తిరుగలేదు. తెలంగాణ అంతటా డిపోల్లోనే ఉండిపోయాయు. అన్ని విద్యా సంస్థలు. మూతపడ్డాయు. వర్తక, వాణిజ్య సంస్థలు, దుకాణాలు నడువలేదు.
హైదరాబాద్ రాజధాని మహానగరం లోని నారాయణగూడ ymca నుండి సుల్తాన్ బజార్, కోఠి, రాంకోఠి మీదుగా బొగ్గుల కుంట, అబిడ్స్ వరకు బంద్ ను పాటిస్తూ ప్రదర్శన జరిగింది. జీపీవో దగ్గర ముగింపు సభ జరిగింది.
సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. గోవర్దన్, సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ, కూనంనేని సాంబశివారావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రో. కోదండరాం, మాస్ లైన్ నాయకులు హన్మేశ్, ఎంసీపీఐ కార్యదర్శి గాదగోని రవి, అరుణోదయ విమలక్క, ఆరెల్లి కృష్ణ మాట్లాడారు.
ఈ ప్రదర్శన లో న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి జేవీ చలపతి రావు, POW జాతీయ కన్వీనర్ వి. సంధ్య, PDSU జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, శ్రీనివాస్, శ్యామ్, గౌతమ్, రహీం, నారాయణ, iftu నాయకులు అరుణ, సత్యనారాయణ పాల్గొన్నారు.
MOST READ :









