Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణసంక్షేమం

District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

జగిత్యాల, (మనసాక్షి)

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నిరుపేదలైన లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల  ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం 400 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవారు జి ప్లస్ వన్ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ప్రజలకు తెలిపాలని అధికారులకు సూచించారు.

పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు కూలీల ఖర్చులు లబ్ధిదారులే చెల్లించాలని తెలిపారు. జగిత్యాల పట్టణంలో ఇసుక బజార్  ప్రభుత్వం ఏర్పాటు చేసిందని లబ్ధిదారులు వినియోగిచుకోవాలని తెలిపారు. నాణ్యత లోపించకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ తెలిపారు.

లబ్ధిదారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తిచేసి బిల్లులు పొందాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రతి ఇంటి బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్ల ప్రగతిని, అలాగే పూర్తయిన ఇండ్ల ఫినిషింగ్ వారం వారం రిపోర్టు లను, టార్గెట్ ప్రకారం ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని అన్ని యూనిట్స్ ఫాలో కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జీవాకర్  రెడ్డి, ఎమ్మార్వో వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. తీగల వంతెన, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి..!

  2. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

  3. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

  5. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి..!

మరిన్ని వార్తలు