TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను తీర్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కూరగాయల సాగును పెంపొందించడానికి గాను రైతులకు ఎకరానికి 9600 సబ్సిడీని ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలలోనే జమ చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా పదివేల ఎకరాలలో కూరగాయల సాగును అదనంగా చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి అవుతుంది. అయితే రాష్ట్రానికి 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉందని అంచనా వేశారు. అయితే ప్రతి ఏటా పదివేల ఎకరాల్లో అదనంగా కూరగాయల సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులు కూరగాయలను సాగు చేయడానికి విత్తనం నుంచి మొదలైతే మార్కెట్ కు తరలించే వరకు ఎకరానికి 24 వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అందుకు గాను ప్రభుత్వం 40% అంటే 9600 రూపాయల సబ్సిడీని రైతులకు అందజేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం తెలిపారు.
రైతులు టమాట, చిక్కుడు, దొండ, కాకర, వంకాయ, బెండ, కాలిఫ్లవర్, మిర్చి, బీర, క్యాబేజీ, క్యాప్సికం, సొరకాయ లాంటి రకాలను సాగు చేసేందుకు ముందుకు వచ్చేవారు స్థానికంగా ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆధారంగా వారికి నారు, విత్తనాలు అందజేస్తారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2.50 ఎకరాల వరకు సబ్సిడీని అందించనున్నారు.
కూరగాయల సాగుకు అవసరమైన నారును సిద్దిపేట, ములుగు, హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లలో సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుకు ఎంపికైన రైతులకు నారుతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందజేస్తారు. దీనిని రైతులు ఉపయోగించుకొని రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని పెంపొందిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
MOST READ :
-
TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!
-
Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!
-
ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!
-
District collector : విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఆ కోర్సులను చదివితే భవిష్యత్తు ఉంటుంది..!
-
Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!









