Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Indiramma Houses : అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు..!

Indiramma Houses : అర్హులకు అందని ఇందిరమ్మ ఇండ్లు..!

అర్వపల్లి, మన సాక్షి :

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రి లు మారిన నిజమైన పేదవారికి ఏ ప్రభుత్వ పథకాలు కూడా అందని ద్రాక్ష పండ్లు గా, మిగిలిపోతున్నాయి. గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు పట్టణాలకే పరిమితమైన డబుల్ బెడ్ రూమ్ గృహాలు, పల్లెలకు చేరలేదు.

ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని నిజమైన లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ప్రతి గ్రామం నుండి 30 నుండి 40 ఇండ్ల వరకు లబ్ధిదారులకు మంజూరు చేశారు.

చాలా గ్రామాలలో నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరుగాలేదని పేద ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో నిరుపేదకు ఇల్లు రాలేదని లబ్ధిదారులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.

పొట్టపాక నాగమణి, భర్త అంజయ్య, ముగ్గురు ఆడపిల్లలు, పట్టాలతో కట్టుకున్న రేకుల ఇంట్లో కాలం వెల్లదిస్తున్నారు. వీరి పరిస్థితిపై పంచాయతీ కార్యదర్శి తోపాటు, సర్వేకు వచ్చిన ప్రతి ఒక్కరు, ఇల్లు మంజూరు చేస్తామని చెప్తూనే, ఎగనామం పెడుతున్నారు.

భర్త అనారోగ్యం, ఎ లాంటి భూమి లేకపోవడం, కూలి పనులు చేస్తేనే భృతి గడుస్తున్న ఒక దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కాలేదో అర్థం కావటం లేదు.
మండల అభివృద్ధి అధికారులు, జిల్లా అధికారులు, స్పందించి నిరుపేద మహిళలకు పోట్టపాక నాగమ్మ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని , ప్రజలు , గ్రామస్తులు కోరుతున్నారు.

MOST READ : 

  1. Alumni : 13 ఏళ్ల తర్వాత ఘనమైన వసంతోత్సవం.. గురు శిష్యుల బంధం మహోన్నతమైనది..!

  2. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  3. ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

  4. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మరిన్ని వార్తలు