Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Cotton : పత్తి పంటకు ఏమైంది.. రైతులకు భారీ నష్టం..!

Cotton : పత్తి పంటకు ఏమైంది.. రైతులకు భారీ నష్టం..!

మనసాక్షి, తుంగతుర్తి :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు ప్రతి సంవత్సరం పత్తి పంటను నమ్ముకుని కొద్ది లాభాలతో రైతు సంతోషపడుతున్న తరుణంలో ఈ సంవత్సరం వర్షాకాలం భారీ వర్షాలు రావడం పత్తి పంట ఎర్రబడి దిగుబడి తగ్గింది. నల్లరేగడి భూములలో నీరు నిలిచి ఎర్రబడిన పత్తి చేనుతో చేను చచ్చిపోయి అధిక నష్టాలతో కూరుకుపోయిన రైతు ఆవేదన చెందుతున్నారు.

ఒక ఎకరానికి 30 నుండి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాకపోయే వరకే అంతా నష్టాలతో రైతు భారీ వర్షాల కారణంగా బంగారు పత్తి పంటను ఏరుకోలేక వర్షంలో నల్లబడి పురుగులతో దర్శనం ఇవ్వడంతో రైతు కంట కన్నీరే తప్ప ఏమీ మిగలలేదని పలు మండలాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్ది గొప్పో పంట పండుతే అకాల వర్షాలతో ఆ పత్తిని వేరడానికి కూలీలు సగం పంటను వారికే అవుతుందని ఇక మిగిలేది ఎకరానికి రెండు మూడు క్వింటాలు అయితే రైతుకు ఒరిగేది ఏముంది.

అంతా నష్టాలతో అకాల వర్షాలతో ముందా తుఫానుతో రైతు ఒరిజినల్ పంట కూడా భూమి పాలు కావడం అకాల వర్షాలతో గాలికి వరి చేను పొలం మీద ఒరిగిపోవడంతో కొయ్యడానికి వీలు లేకుండా పంట నష్టం అయిందనిరైతులు గగ్గోలు పెడుతున్న పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు.

ఇక ఈ పత్తిని అమ్మడానికి CCI కేంద్రాల వద్ద పత్తి మిల్లుల వద్ద అర్ధ బ్రోకర్ల రాజ్యం ధరలు లేకపోవడం రైతు నష్టాల పాలు అవుతున్నామని మొరపెట్టుకున్నప్పటికీ ధర పెంచకపోవడం పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్లు రైతు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనే విధంగా మిల్లుల వద్ద అవకతవకలు జరగకుండా రైతుల ధాన్యాలను పత్తి కొనుగోలు చేయాలని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనియెడల రాస్తారోకోలు, బంద్ పెడతామని హెచ్చరిస్తున్నారు.

MOST READ :

  1. Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

  2. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

  3. TG News : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. నేరుగా ఖాతాలలో ఎకరానికి రూ.9600..!

  4. Pension : రైతులకు భారీ గుడ్ న్యూస్.. నెలకు రూ. 3000 పెన్షన్.. ఎవరు అర్హులంటే..!

మరిన్ని వార్తలు