Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అలా చేస్తే కఠిన చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అలా చేస్తే కఠిన చర్యలు..!

నల్లగొండ, మనసాక్షి :
వానాకాలం ధాన్యం సేకరణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె ధాన్యం సేకరణ పై సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్లు , మండల వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా యంత్రాంగం ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, నవంబర్ తోపాటు, డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చేందుకు అవకాశం ఉన్నందున దీనిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు.

ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రత్యేకించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే తేమశాతాన్ని పరిశీలించి 17% తేమ వచ్చిన వెంటనే తాలు, తరుగు వంటివి లేకుండా నాణ్యత ప్రమాణాలతో ఉంటే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు.

ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లలో ఏలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రత్యేకించి ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లు, తూకం వేసే యంత్రాలు అన్నింటిని సంసిద్ధం చేసుకోవాలని, లారీలు, హమాలీల కొరత ఉంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అంతేకాక మిల్లుల వద్ద కూడా మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, స్థలం, హమాలీల సాకుతో, తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించకూడదని, ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ధాన్యం సేకరణ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ట్రక్ సీట్ల జారీ, తూకం, నాణ్యత ప్రమాణాల దృవపత్రాలు జారీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ దాన్యం సేకరణకకు సంబంధించి సూచనలను జారీ చేశారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డి.ఎస్.ఓ వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, డిసిఓ పత్యా నాయక్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, తదితరులు మాట్లాడారు. ఈ టెలి కాన్ఫరెన్స్ కు తహసిల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.

MOST READ : 

  1. Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!

  2. Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

  3. RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..! 

  4. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

  5. TG News : ప్రభుత్వ పాఠశాలల్లో 2837 కంప్యూటర్ ఉద్యోగాలు.. రూ.15 వేల వేతనం, అర్హులు వీరే..!

మరిన్ని వార్తలు