Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. 20 మంది ఉన్న పత్తి కూలీల ఆటో బోల్తా..!

Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. 20 మంది ఉన్న పత్తి కూలీల ఆటో బోల్తా..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నేరేడుగొమ్ము మండలం బుగ్గతండ సమీపంలో పత్తి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 14 మంది కూలీలు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

​పీఏపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామానికి చెందిన సుమారు 20 మంది పత్తి కూలీలు కూలి పని కోసం కచరాజు పల్లి వైపు ఆటోలో బయలుదేరారు. ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బుగ్గతండ వద్దకు చేరుకోగానే అదుపు తప్పడం వలనో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. రోడ్డుపై ఎగసిపడిన కూలీలు తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు.

​గాయపడిన వారందరినీ వెంటనే 108 అంబులెన్స్ ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మౌనిక, కన్నమ్మ, సునంద, కమలమ్మ, చింటూ, అంజమ్మ, వెంకటయ్య, రమేష్, అరవింద్, వెంకటేసులమ్మ, అఖిల, రమణ ఉన్నారు.

​ప్రమాద విషయం తెలియగానే నేరేడుగొమ్ము ఎస్సై కే. నాగేంద్ర తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు.

ఎస్సై కే. నాగేంద్ర మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి కూలీలను ఎక్కించడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..! 

  2. Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!

  3. Paddy : క్వింటా ధాన్యంకు రూ.2389.. అదనంగా రూ.500 బోనస్..!

  4. Fee : పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూళ్లు.. డీఈఓ ఆదేశాలు బేఖాతర్..!

మరిన్ని వార్తలు