TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!

TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
సూర్యాపేట, మనసాక్షి
అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని పిఎసిఎస్ ,అధ్యక్షులు, కార్యదర్సులు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో ఆయిల్ ఫామ్ సాగుపై సమావేశం నిర్వహించారు.
భారతదేశం మలేషియా, ఇండోనేషియా, ఆగ్నేషియా దేశాల నుండి లక్ష కోట్లు ఖర్చుపెట్టి ఏడీబుల్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలోని భూములు ఆయిల్ ఫామ్ కు సానుకూలంగా ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా ఎంచుకొని ముందుకెళ్తుందని, జిల్లాలో ఇప్పటికే 5560 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగిందని, 2025-26 సంవత్సరానికి 3000 ఎకరాలు లక్ష్యంగా ఎంచుకోగా, 2011 ఎకరాలను గుర్తించి, 1139 ఎకరాలకు సబ్సిడీ మంజూరు చేయగా 696 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలను నాటడం పూర్తి అయినదని స్పష్టం చేశారు.
వరి లాంటి సాంప్రదాయ పంటల నుండి అధిక లాభాలను చేకూర్చే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకి ఎకరానికి 50,918 రూపాయలు సబ్సిడీ ద్వారా అందిస్తున్నదని, ఒక్కసారి మొక్క నాటితే మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుండే పంట దిగుబడి వస్తుందని, అలాగే అంతర పంటగా కూరగాయలు, పూలు , కంది,పెసర లాంటి పంటలు సాగు చేసి లాభాలు పొందవచ్చని తెలిపారు.
తక్కువ శ్రమతో, తక్కువ నీటి వనరులతో, ఎక్కువ కాలం లాభాలు చేకూర్చే ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ తోటలకు తీసుకొని వెళ్లి అక్కడ రైతులకు సాగు కు అయ్యే ఖర్చు, శ్రమ,వచ్చే లాభాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలలో నివసించే వారికి స్వగ్రామంలో భూములు ఉంటే పామాయిల్ సాగు అనుకూలంగా ఉంటుందని ఆసక్తి ఉన్న అలాంటి వారిని గుర్తించి సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సంవత్సరం నుండి ప్రతి సహకార సొసైటీ పరిధి లో వెయ్యి ఎకరాల చొప్పున 47 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతులను అవగాహన పరచాలని సొసైటీ అధ్యక్షులకు, కార్యదర్శిలకు కలెక్టర్ సూచించారు. రైతులు పండించిన పంటను నిలువ చేసేందుకు స్థలం ఉన్న పిఎసిఎస్ లు నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకొని గోదాములు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించుకోని వాటిని అద్దె ప్రతిపాదికన లీజుకి ఇచ్చి రుణాలు చెల్లించుకోవాలని సూచించారు.
తదుపరి హర్టికల్చర్ టెక్నికల్ అధికారి మహేష్ పి పి టి ద్వారా ఆయిల్ పామ్ సాగు కి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశానికి జిల్లా సహకార అధికారి ప్రవీణ్, ఉద్యానవన అధికారి నాగయ్య, వ్యవసాయ అధికారి నివేదిత, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ అంజయ్య, తదితరులు హాజరయ్యారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. 20 మంది ఉన్న పత్తి కూలీల ఆటో బోల్తా..!
-
Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..!
-
Suryapet : మీ మొబైల్ ఫోన్ పోయిందా.. CEIR పోర్టల్ లో నమోదు చేస్తే చాలు దొరికినట్టే..!
-
Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!









