District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!

District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!
సూర్యాపేట, మనసాక్షి :
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న సూర్యాపేట డివిజన్ కు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదటి విడతన 8 మండలాలలోని 159 గ్రామపంచాయతీలు, 1442 వార్డులకు 44 నామినేషన్ కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, గ్రామపంచాయతీ ఎన్నికలను అధికారులందరూ సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పాటించాల్సిన అన్ని నియమాలను తూ.చా తప్పకుండా పాటించాలని, సమయపాలన పాటించాలని, నామినేషన్ల కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తగినన్ని నామినేషన్ ఫారాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నియమ, నిబంధనలను తూ.చా తప్పకుండా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎంపీ డి వో లు ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశమునకు అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డిపిఓ యాదగిరి, డి ఆర్ డి ఏ పి డి వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Police Commissioner : పోలీస్ కమీషనర్ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!
-
Miryalaguda : నగదు బహుమతులు గెలుచుకున్న సెయింట్ జాన్స్ విద్యార్థులు..!
-
Karimnagar : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాదాల అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
-
Minister Komatireddy : మహిళలకు మంత్రి కోమటిరెడ్డి అతి బారీ శుభవార్త.. రైస్ మిల్లుల ఏర్పాటుకు తోడ్పాటు..!









