CM Revanth : తెలుగులో భారత రాజ్యాంగ గ్రంథం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth : తెలుగులో భారత రాజ్యాంగ గ్రంథం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!
హైదరాబాద్, మన సాక్షి :
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు, ఇంగ్లీషు భాషలో ముద్రించిన భారత రాజ్యాంగం ద్విభాషా గ్రంథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సమగ్రంగా తెలుగులో అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
రాజ్యాంగం తెలుగు భాషలో ప్రచురించడం వల్ల భాష, సంస్కృతిని కాపాడటంతో పాటు భావి తరాలు, మేథావులు, సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయుక్తంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. తెలుగులో తర్జుమా చేసి సమగ్రంగా రాజ్యాంగాన్ని తెలుగు – ఇంగ్లీషు ద్విభాషలో అందించడం వల్ల అనేక విషయాల్లో స్పష్టత ఉంటుందని, ముఖ్యంగా తెలుగు వారికి, సామాన్యులకు సులభంగా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవడానికి వీలవుతుందని అన్నారు.
ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసిన సందర్భంగా న్యాయ శాఖ కార్యదర్శి పాపిరెడ్డి , ఆ శాఖ ఇతర అధికారులు ఉన్నారు.
MOST READ :
-
TG News : రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి..!
-
Narayanpet : భగవద్గీత కంఠస్థంలో ఘనాపాటి.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి మోక్షిత..!
-
Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!
-
Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!
-
Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!









