Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TG News : డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..!

TG News : డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..!

చిట్యాల, మన సాక్షి :

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో తొలి విడుత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో దర్శనమిచ్చాయి. ఈ సంఘటన తీవ్ర గందరగోళానికి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆ గ్రామంలో విజయం సాధించారు. దాంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రుద్రారపు భిక్షం ఆరోపించారు.

ఇదిలా ఉండగా మురుగు కాలువలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లన్నీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు వేసినవే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బ్యాలెట్ పత్రాలతో సహా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా అన్ని గ్రామాలలో ఇదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్ చేసి గెలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు