District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారం ఉండాలి..!
రెవిన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారం ఉండాలి..!
నల్లగొండ, మన సాక్షి
రెవిన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి ఆయన శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ఖచ్చితమైన పరిష్కారం ఉండాలని, తరచు వచ్చే ఫిర్యాదులు తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, పిర్యాదుదారుకు రాశీదు ఇవ్వాలని,ఫిర్యాదుల రిజిస్టర్లు, అన్ని వివరాలు కచ్చితంగా నిర్వహించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సం క్షేమ పథకాల అమలులో అవసర సమయాలలో రెవెన్యూ అధికారులు పూర్తిగా భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రతినెల తప్పనిసరిగా తహసిల్దార్ ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతి ,పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, ఆర్ డి ఓ అశోక్ రెడ్డి,దేవరకొండ ఆర్ డి ఓ రమణా రెడ్డి తదితరులు ఉన్నారు.









