Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో యూరియా బుకింగ్ ఆప్ గురించి మంగళవారం రైతులకు మండల వ్యవసాయ అధికారి పురుషోత్తం అవగాహన కల్పించారు.

Urea App : రైతులు యూరియా యాప్ గురించి తెలుసుకోవల్సిందే.. అధికారులు ఏం చెప్పారంటే..! 

కేతేపల్లి, మన సాక్షి :

కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో యూరియా బుకింగ్ ఆప్ గురించి మంగళవారం రైతులకు మండల వ్యవసాయ అధికారి పురుషోత్తం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియ యాప్ వల్ల రైతుసోదరులు తమ ఇంటి వద్ద నుండే యూరియ బుక్ చేసుకొని, చేసుకున్న రోజే యూరియ తీసుకోవచ్చు అని ఆయన తెలిపారు.

ఈ యాప్ వల న రైతులు యూరియ కోసం గంటల తరబడి ఎరువుల దుకాణం వద్ద వెళ్లి నిలబడే బాధ లేకుండా వెంటనే తీసుకోవచ్చని, దీని వల్ల రైతుకి సమయం ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఫెర్టిలైజెర్ డీలర్స్ యూరియ విషయంలో రైతులకు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ ధరకే యూరియ అమ్మాలని ఆయన తెలిపారు.

మండల రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకొనీ యూరియ పొందారని, రైతులు కూడా ఈ ఆప్ విషయంలో సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. ఇప్పటివరకు కేతేపల్లి మండల పరిధిలో ఈ యూరియా ఆప్ ద్వారా 1155 రైతులు యూరియా బుక్ చేసుకోని 3075 యూరియా బస్తాలు కొనుగోలు చేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఉమేష్, రైతులు బెంజరాపు మారయ్య, చిన గోపాల్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు