Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Yadadri : యాదాద్రి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురి అరెస్ట్..!

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారులో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ ఐ తక్యుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..

Yadadri : యాదాద్రి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురి అరెస్ట్..!

తుర్కపల్లి, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ శివారులో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ ఐ తక్యుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..

మాదాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారని సమాచారం అందడంతో తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా సంఘటన స్థలానికి చేరుకొని ఆరుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.

వారి వద్ద నుండి ఒక హిటాచి( జెసిపి), ఒక కారు, క్షుద్ర పూజల కోసం ఉపయోగించిన పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

అరెస్టు చేసిన వారిలో పులి కుమారస్వామి (ఈసీఐఎల్), రామినేని కృష్ణ కిషోర్(విజయవాడ), పాగోలు శ్రీనివాస్(విజయవాడ), ఆకుల నరసింహారావు(విజయవాడ) తాత కృష్ణ కాంత్ ( ఖమ్మం),పల్లపు వేణు(బొమ్మలరామారం) ఉన్నారని తెలిపారు.

ప్రజలు ఎవ్వరు మూఢనమ్మకాలు క్షుద్ర పూజలను నమ్మి మోసపోవద్దని అన్నారు. అక్రమంగా గుప్తనిధుల తవ్వకాలు జరపడం చట్టరీత్య నేరమని ,ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద త్రవ్వకాలు లేదా క్షుద్ర పూజల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

MOST READ 

  1. Karimnagar : సిపి తీవ్ర హెచ్చరిక.. చైనీస్ మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆగని వలసలు.. బీ ఆర్ ఎస్ లో భారీగా చేరికలు..!

  4. TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు