Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆనాటి పూర్వ విద్యార్థులు పదవ తరగతి చదువుకున్న 1984 నుండి 1985 పూర్వ విద్యార్థుల కలయికతో వారి అనుభూతిని నెమరు వేసుకున్న పదవ తరగతి 69 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి సంతోషాలకు అవధులు లేవు.

Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

తుంగతుర్తి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆనాటి పూర్వ విద్యార్థులు పదవ తరగతి చదువుకున్న 1984 నుండి 1985 పూర్వ విద్యార్థుల కలయికతో వారి అనుభూతిని నెమరు వేసుకున్న పదవ తరగతి 69 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడంతో వారి సంతోషాలకు అవధులు లేవు.

ఆనాటి గురువుల ను ఘనంగా సన్మానించారు . ఆనాటి వారి గురువులు సోలిపురం రంగారెడ్డి హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా అహల్య ప్రభాకర్ రెడ్డి విమల శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది ఉపాధ్యాయులు చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి గ్లాసులలో చెప్పిన పాఠాలు ఈనాటికి జ్ఞాపకం ఉన్నాయని వారి శిష్యులు మాట్లాడారు.

వెలుగుపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఆనాడే 15 సంవత్సరాలు ఇక్కడే హెచ్ఎంగా పనిచేస్తున్న సోలిపురం రంగారెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంబరంలో భాగంగా ఆ రోజులలో గురువు అంటే గౌరవిస్తూ చెప్పిన వాటిని శ్రద్ధగా వింటూ ఇంటి వద్ద కూడా తల్లిదండ్రుల శ్రద్ధతో చదివిన విద్యార్థులంతా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారని మంచి ఉద్యోగాలు పొందారని ఆయన వారి శిష్యులను చూసి గౌరవంగా హుందాగా సంతోషం వ్యక్తం చేశారు.

ఆ రోజులలో విద్య కోసం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ తల్లిదండ్రుల నుండి కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని కానీ రోజు రోజుకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రోజులలో విద్య వ్యాపారం గా మారిందని ఎవరిని బాధ పెట్టకుండా గురువులు విద్యను అభ్యసించుడే తప్ప ఇప్పుడు ఉన్న గురువులు విద్యార్థులను మందలివ్వకుండా వారి పాటలు వారు చెప్పుకుంటూ వెళ్లిపోయే పరిస్థితి ఈ రోజులలో ఆనాడు తల్లిదండ్రులు కూడా మా పాఠశాలకు వచ్చి మా పిల్లలకు చదువు మంచిగా చెప్పండి మీరు ఎన్ని కొట్టిన మేము అని చెప్పుకునేవారు.

ఆ రోజులలో ఒక్కనాడు బడికి రాకుండా ఎందుకు రాలేదని మందలిస్తే వారి కుటుంబ సభ్యులు వచ్చి సమాధానం చెప్పేవారు ఆ రోజులలో విద్యను అభ్యసించిన వారు మంచి నేర్పరి తో ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తులో బాగున్నాయని అదేవిధంగా మీ విద్యార్థులు తో పాటు మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబం కూడా మంచి చదువులను చదివించి మీ పిల్లలను కూడా ప్రయోజకులను చేస్తున్నారు.

ఆ రోజులలో మా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 69 మంది విద్యార్థులు ఈరోజు మన కలయిక ఈ పాఠశాలలోనే కలవడంతో చాలా సంతోషంగా ఉందన్నారు మీ యొక్క అనుభూతిని తెలుసుకొని మీరు మంచిగా కుటుంబాలతో పిల్లలతో ప్రశాంత వాతావరణంలో జీవించడమే గొప్పతనం అన్నారు అధిక ఆశలతో ఎక్కువ డబ్బు ఆశతో సంతృప్తి కలగదు కానీ మంచితనంతో ఎవరిని మోసం చేయకుండా మనం బ్రతకడమే గొప్పతనం అన్నారు.

పేదవారికి సహాయం చేసే గుణం ఉంటే చాలు మంచితనం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి అనుభూతిని పాలుపంచుకుంటూ సంతోషంగా 40 సంవత్సరాల కలయికను చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందని వారు ఆకాంక్షించారు ఇలాంటి కలయిక మరల కూడా మరల ఎన్నోసార్లు చేసుకుందామని వారి గురువులతో పూర్వ విద్యార్థులు పాదాభివందనాలు చేసి మీ రుణము తీర్చుకోలేమన్న పూర్వ విద్యార్థులు.

ఈ కార్యక్రమంలో మైదం నారాయణ, ఎస్కే జానీ, హనుమంతు రెడ్డి, విట్టల్ రెడ్డి, సోమరాజు, అల్లం శ్రీను, వెంకన్న, బీజాల ఇంద్ర, భారతి, మాలతి, శ్రీలక్ష్మి , ఆయుష, భాను, పద్మ, కళమ్మ, వినోద పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ NEWS 

  1. District collector : జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని అవార్డు..!

  2. Suryapet : మంచినీళ్లు రాక రెండు నెలలు.. ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ వద్ద మహిళల నిరసన..!

  3. BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీబీఏ విద్యార్థులు మృతి..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి..!

  5. District collector : జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని అవార్డు..!

మరిన్ని వార్తలు