Miryalaguda : ఎన్నికల ముందు మిర్యాలగూడలో అధికార పార్టీ జమ్మికులు..!
మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పార్టీ జిమ్మిక్కులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ప్రమాదకరమైన రాజకీయ క్రీడపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Miryalaguda : ఎన్నికల ముందు మిర్యాలగూడలో అధికార పార్టీ జమ్మికులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పార్టీ జిమ్మిక్కులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ప్రమాదకరమైన రాజకీయ క్రీడపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకుండా ఇందిరమ్మ ఇల్లు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేవలం మిర్యాలగూడలోని ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ దరఖాస్తు కోరడం పచ్చి అబద్ధమని తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక జీవో లేదని, పండగ పూట ప్రజల ఇబ్బందులు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాల కోసం సెలవు దినాల్లో పేదలను ఇబ్బంది పెట్టడం శోచనీయమన్నారు.
కేవలం రెండు రోజుల గడువు ఇచ్చి దరఖాస్తులు అడగటం వెనుక కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా పార్టీ కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకోవడం తెలుసుకోవాలన్నారు.
మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో ఫారాలను ఇవ్వడం అంటే ఇది ముమ్మాటికి ఓట్ల కోసం చేస్తున్న గాలమే అని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఫేక్ ఫారాలు నింపించి ఎన్నికల తర్వాత ప్రజలను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు.
గడిచిన పదేళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నేతృత్వంలో మిర్యాలగూడ సాధించిన అభివృద్ధి మీ కళ్ళముందే ఉందన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పుడు సెంటిమెంట్ మాటలతో ప్రజలను వంచించాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెల్మెట్లకు, ఉచితాల ఆశలకు లొంగవద్దని అభివృద్ధిని కాంక్షించే వారికే మద్దతు తెలపాలని ఆయన కోరారు.
MOST READ :
-
Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!
-
పండుగ పూట విషాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..!
-
Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!
-
Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల రిజర్వేషన్లు ఇవీ.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..!
-
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!
-
Miryalagida : మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఇవీ రిజర్వేషన్లు.. బీసీలకు ఎన్ని సీట్లు అంటే..!