Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివిద్య
Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని శంకర్‌పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి అన్నారు.

Model Schools : మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!
శంకర్‌పల్లి, మన సాక్షి:
తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని శంకర్‌పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి అన్నారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 6వ తరగతిలో మొత్తం 100 సీట్లు, 7, 8, 9,10వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్టుగా పేర్కొన్నారు.









