జాతరలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లా
Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను పునర్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భక్తులకు అంకితం చేశారు.

Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూ రో :
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను పునర్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భక్తులకు అంకితం చేశారు. సహచర మంత్రులతో కలిసి ఆయన పునర్నిర్మించిన గద్దెలను ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మేడారంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన మేడారంలోనే రాత్రి బస చేశారు.















