District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం మున్సిపల్ ఎన్నికల హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదువుకోవాలి..!
రానున్నమున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఆర్వోలు, ఏఆర్వోలు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం మున్సిపల్ ఎన్నికల హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదువుకోవాలి..!
నలగొండ, మన సాక్షి :
రానున్నమున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఆర్వోలు, ఏఆర్వోలు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమించబడిన ఆర్వోలు, ఏఆర్ఓ లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలకు నియమించబడిన ప్రతి ఒక్కరు విధులు నిర్వహించాలని అన్నారు.
ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం హ్యాండ్ బుక్ ఆధారంతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదువుకొని తప్పులు లేకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని చెప్పారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ నుండి పోలింగ్,కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అన్ని అంశాల పట్ల ముందే సంసిద్ధం కావాలని ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
ఎట్టి పరిస్థితులలో రీకౌంటింగ్ అన్నది లేకుండా జాగ్రత్తగా ఎన్నికలను నిర్వహించాలని, నామినేషన్ల మొదలుకొని ఇతర వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు టీ పోల్ లో అప్లోడ్ చేయాలని, అందుకు సంబంధించిన సామాగ్రి నంతటిని సిద్ధం చేసుకోవాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగ పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా బ్యాలెట్ పేపర్ ముద్రణ, గుర్తుల కేటాయింపు వంటి వాటిని పాటించాలని తెలిపారు.
నామినేషన్ల సమయంలో నామినేషన్ ఫామ్ లతో పాటు, ఓటర్ జాబితా, అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ కేసులు,చెక్ లిస్ట్, డిపాజిట్,వంటి వాటాన్నిటిని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థుల డిపాజిట్, ఖర్చుల పరిమితి తదితర వివరాలన్నింటినీ ఆయన ప్రశ్న, జవాబుల ద్వారా ఆర్ఓలు ఏ ఆర్ ఓ ల ద్వారా రాబట్టారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి జె. శ్రీనివాస్ ,గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, తదితరులు ఉన్నారు.
MOST READ NEWS :
-
District Collector : నూతన సర్పంచులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. శిక్షణ శిబిరం ప్రారంభం..!
-
BIG BREAKING : ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తుండగా కారు ప్రమాదం.. ప్రధానోపాధ్యాయురాలు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
-
Tragedy : శబరిమల వెళ్లి వస్తుండగా తమిళనాడులో ప్రమాదం. తెలంగాణకు చెందిన దంపతులు మృతి..!
-
Post Office : లక్షకు రెండు లక్షలు.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ గొప్ప స్కీం, కేంద్రం మద్దతు గ్యారెంటీ రిటర్న్స్..!
-
అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!
-
TG News : మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్లు ఖరారు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!









