Narayanpet : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రతి ఇంటికి త్రాగునీరు..!
నారాయణపేట జిల్లాలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి రానున్న వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

Narayanpet : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ప్రతి ఇంటికి త్రాగునీరు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించి రానున్న వేసవిలో దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్ లో జిల్లా త్రాగునీరు పరిశుభ్రత మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వాటర్ ట్యాంకులలో పరిశుభ్రంగా ఉంచేలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ నాణ్యమైన నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాల ఎంపీఓలు తాగునీటి సరఫరా, వాటర్ ట్యాంకుల పరిశుభ్రత అంశాలపై సమావేశాలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప , మిషన్ భగీరథ డి.ఈ. రంగారావు, డిపివో సుధాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
By : Ramakanth, 9052041606
MOST READ
-
Miryalaguda : కేంద్రీయ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్..!
-
Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!
-
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!
-
Miryalaguda : మిర్యాలగూడలో అధికార పార్టీ ఆశావహులకు నిరాశ.. రిజర్వేషన్ల ఎఫెక్ట్..!









