Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Nalgonda : నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు ఎస్పీకి ఫిర్యాదు..!

బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టమని, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలని వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై చట్టం చర్య తీసుకోవాలని కోరుతూ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎస్పీ శరత్చంద్రప్ప వరకు ఫిర్యాదు చేశారు.

Nalgonda : నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేతలు ఎస్పీకి ఫిర్యాదు..!

నల్లగొండ, మనసాక్షి.

బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టమని, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలని వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిపై చట్టం చర్య తీసుకోవాలని కోరుతూ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ నాయకులు మంగళవారం ఎస్పీ శరత్చంద్రప్ప వరకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాని కే విఘాతం కలిగించేలా వారి వ్యాఖ్యలు ఉన్నందువలన, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.

ఎస్పీ ని కలిసిన వారిలో,శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితరులు ఉన్నారు.

By: SHEKAR, NALGONDA

MOST READ : 

  1. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

  2. అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన మనసాక్షి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య..!

  3. Nalgonda : మహిళలు స్వయం శక్తితో ఎదగాలి.. మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

  4. Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!

  5. Municipal Elections : మున్సిపల్ చైర్ పర్సన్స్ రిజర్వేషన్ల ఖరారు.. రాష్ట్రంలోని మున్సిపల్ రిజర్వేషన్లు ఇవీ..!

మరిన్ని వార్తలు