శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, మహేష్ బిఆర్ఎస్ లో చేరారు.

శంకర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, మహేష్ బిఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో గులాబీ జెండా ఎగరాలని, చైర్మన్ పీఠం దక్కించుకోవాలని అన్నారు. నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, న్యాయవాది ఉపేందర్ రెడ్డి, యూత్ లీడర్ ఎజాస్ ఉన్నారు.
MOST READ :
-
Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!
-
Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
-
Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!









