TOP STORIESBreaking Newsనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతల అంతర్మధనం.. ఎవరు, ఎక్కడ పోటీ..!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మదనంలో ఉన్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతల అంతర్మధనం.. ఎవరు, ఎక్కడ పోటీ..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మదనంలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ తగ్గింది. తాము పోటీ చేయాలనుకున్న స్థానంలో అనుకూలంగా రిజర్వేషన్ రాకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చును. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను సుమారుగా 17 వార్డులలో ఆ నేతలకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో అంతర్మదనంలో ఉన్నారు.

వారంతా సమీప వార్డుల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నప్పటికీ అక్కడ మొదటి నుంచి టికెట్ ఆశించినవారు ఒప్పుకునే పరిస్థితులు కనిపించడం లేవు. తమ వార్డులో తామే పోటీ చేయాలని సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో దశాబ్ద కాలంకు పైగా మున్సిపల్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలకు సైతం రిజర్వేషన్లు అనుకూలం రాకపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి.

ఎవరు , ఎక్కడ పోటీ :

మిర్యాలగూడ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కొక్క వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దానికి తోడు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రాని నేతలు సైతం పక్క వార్డుల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. కేవలం కొన్ని వార్డులలో మాత్రమే స్పష్టంగా ఉండడంతో వారు ఇప్పటికే వార్డులలో ఓటర్లకు చేరువయ్యే పనిలో ఉన్నారు.

అంతా ఎమ్మెల్యే పై భారం :

తమకు రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పై భారం వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ వార్డు రిజర్వేషన్లు అనుకూలంగా రాలేదని, సమీప వార్డులలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇలాంటివారు పట్టణంలో సుమారుగా 15 మందికి పైగా ఉండడంతో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా దశాబ్ద కాలంకు పైగా రాజకీయాల్లో ఉన్న నేతలు అంతర్మదంలో ఉన్నారు.

MOST READ 

  1. TG News : మున్సిపల్ కమిషనర్లు భారీగా బదిలీలు..!

  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  3. Gold Price : బంగారం ధర ఒక్కరోజే భారీగా రూ.21,300.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. రైతు భరోసా పై కీలక అప్డేట్..!

మరిన్ని వార్తలు