Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

యువతిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం, వీడియో తీసిన మరో మహిళ

యువతిపై నలుగురు యువకుల

అత్యాచారయత్నం, వీడియో తీసిన మరో మహిళ

హైదరాబాద్ : తన భర్తతో మరో యువతి మాట్లాడడంపై అనుమానం పెంచుకున్న భార్య దారుణానికి ఒడిగట్టింది. మాట్లాడుకుందామని ఇంటికి పిలిచి గదిలో బంధించి నలుగురు యువకులతో అత్యాచారం యత్నం జరిపించి వీడియోలో చిత్రీకరించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనం రేపుతోంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం కు చెందిన యుపతి హైదరాబాద్ లోని కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంది. అదే కాలనీలో ఉంటున్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం పై యువకుడి భార్య అనుమానం పెంచుకుంది. దాంతో మాట్లాడాలంటూ యువతిని ఈనెల 26వ తేదీన ఇంటికి పిలిచింది. పథకం ప్రకారమే గది బంధించింది. అప్పటికే గదిలో నలుగురు యువకులు ఉన్నారు. ఆ నలుగురు యువకులు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దారుణంగా హింసించారు . కాగా ఈ సంఘటనను యువకుడి భార్య వీడియోలో చిత్రీకరించింది. ఈ సంఘటన ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వీడియో పెడతామని బెదిరించింది. దాంతో తీవ్ర రక్తస్రావం ఐన బాధితురాలు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను రిమాండ్ కు తరలించారు.

ఇది కూడా చదవండి

1. BREAKING : విమానం ఆచూకీ గల్లంతు, 22 మంది ప్రయాణికులు, నలుగురు భారతీయులు

2. బావిలో శవమై తేలిన ముగ్గురు అక్క చెల్లెలు, ఇద్దరు చిన్నారులు

3. దామరచర్ల లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మరిన్ని వార్తలు