Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

రిజర్వాయర్ వద్దు.. మాకు భూమి ముద్దు..!

వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్, ఇర్విన్ గ్రామాలలో నిర్వహించు ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని భూ నిర్వాసితులు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

రిజర్వాయర్ వద్దు.. మాకు భూమి ముద్దు..!

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ ను నిలిపివేయాలని కలెక్టర్ కు వినతి పత్రం 

వెల్దండ, మన సాక్షి :

వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్, ఇర్విన్ గ్రామాలలో నిర్వహించు ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని భూ నిర్వాసితులు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈనెల 4న భూ నిర్వాసితులకు అందిన నోటీసుల ప్రకారం గ్రామసభ సమావేశం నిర్వహించి, కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయంలో రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే.

గ్రామంలో ఒకటి, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న కారు రైతులే చాలావరకు ఉన్నామని, భూములు కోల్పోతే మా ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వినతి పత్రంలో పేర్కొన్నారు. రిజర్వాయర్ పేరుతో మొత్తం 186.30 ఎకరాల భూమిని కోల్పోతామని,ముఖ్యంగా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గౌడన్నలకు మా భూములలో ఉన్న ఈతచెట్లు, తాటి చెట్లు కోల్పోయి ఉపాధిపరంగా తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్, భూ నిర్వాసితులు మల్లేష్, మహేష్, ఈశ్వర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు