lifestyleప్రపంచం

విచిత్రమైన పెళ్లి : తనను తానే పెళ్లి చేసుకోబోతున్న యువతి – latest news

విచిత్రమైన పెళ్లి : తనను తానే

పెళ్లి చేసుకోబోతున్న యువతి

అహ్మదాబాద్ : ఇలాంటి పెళ్లిని మీరు ఎప్పుడు చూసి ఉండరు, కనీసం విని ఉండరు. ఓ యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతుంది. అంటే స్వియ వివాహం. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అందుకే వివాహ వేడుకను ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని జంటలు భావిస్తుంటారు. సాధారణంగా పెళ్ళి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండాలి. కానీ ఈ మధ్య అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని, అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇంతకు మించి విచిత్రమైన పెళ్లి ఒకటి జరగబోతుంది.
గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు స్వియ వివాహం చేసుకోబోతోంది. అంటే వరుడు ఉండడు. విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం. జూన్ 11న వివాహ వేడుకను ఘనంగా జరుపుకోబోతుంది. అమ్మాయి, అబ్బాయి పెళ్లి వేడుకల్లో ఉన్నట్టుగానే ఈ పెళ్లి లో కూడా అన్ని సంప్రదాయాలను పాటిస్తారు. మెహందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ హనీమూన్ ఇలా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారంట. జూన్ 9న మెహందీ ఫంక్షన్, జూన్ 11న సాయంత్రం 5 గంటలకు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. మెహందీ రోజున ధోతి, కుర్తా ధరిస్తానని, పెళ్లి రోజున చీర కట్టుకుంటానని క్షమాబిందు చెప్పింది. ఈ వివాహ వేడుకకు 15 మంది మిత్రులు, సన్నిహితులు హాజరవుతున్నారని ఆమె పేర్కొంది.

గోత్రిలోని దేవాలయంలో తన వివాహాన్ని ఘనంగా జరుపుకున్న తర్వాత హనీమూన్ కోసం గోవా వెళ్తానంటుంది క్షమాబిందు. స్వియ వివాహం అనేది మనకోసం ఉండాలని నిబద్ధత. మన పట్ల షరతులు లేని ప్రేమ. ఇది కూడా స్వీయ అంగీకార చర్య. ప్రజలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు. నేను నన్ను ప్రేమిస్తున్నాను అందుకే ఈ పెళ్లి అని క్షమాబిందు వివరించారు. ఇటువంటి వివాహం అనేది అసందర్భమైందని కొందరు అంటారు కానీ, నేను నిజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. నా తల్లిదండ్రులు విశాలమైన భావాలు కలిగిన వారని, పెళ్ళికి వారి ఆశీర్వాదం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

1. నల్గొండ జిల్లాలో ఘోరం, ట్రాక్టర్ రోటో వేటర్ లో ఇరుక్కోని బాలుడు మృతి – latest news

2. మొగులయ్య, నిఖత్ జరీన్, ఈషా సింగ్ లకు సీఎం కెసిఆర్ సత్కారం

3. రైస్ పుల్లింగ్ చెంబు పేరుతో బురిడి కొట్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్

మరిన్ని వార్తలు