Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsరంగారెడ్డిహైదరాబాద్

ఇద్దరికి చూపునిచ్చిన 92 ఏళ్ల వృద్ధురాలు..! 

లయన్స్ క్లబ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో హైదరాబాద్లో మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని నిరూపించారు.

ఇద్దరికి చూపునిచ్చిన 92 ఏళ్ల వృద్ధురాలు..! 

ఆమనగల్లు, మన సాక్షి:

లయన్స్ క్లబ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో హైదరాబాద్లో మరణానంతరం కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని నిరూపించారు. హైదరాబాద్‌కు చెందిన 92 ఏళ్ల అర్థం తిరుపతమ్మ ఆమె మరణం తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రాలను సేకరించి ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందజేసి నట్లు లయన్స్ క్లబ్ ఆమనగల్లు ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌కు చెందిన అర్థం తిరుపతమ్మ (92) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సమాచారం అందుకున్న లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్లు కండె ఓంకారం జూలూరు రమేష్ క్షేత్రస్థాయికి చేరుకుని కుటుంబ సభ్యులను నేత్రదానం వైపు ప్రోత్సహించారు. వారి అంగీకారంతో ఎల్వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది సహకారంతో నేత్రాలను విజయ వంతంగా సేకరించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కె.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అవయవ దానం నేత్ర దానంపై ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. నియోజక వర్గ స్థాయిలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామని నేత్ర దానం చేసిన తిరుపతమ్మ కుటుంబానికి క్లబ్ తరపున అండగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గంప శ్రీనివాస్, కోశాధికారి అక్షర శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు అర్థం మురళి, అర్థం వెంకటయ్య,అర్థం గోపాల్, శశికళ, పద్మ,సాయి లక్ష్మి,లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు