Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Baby : అంగట్లో వస్తువులా చేతులు మారిన శిశువు..!

Baby : అంగట్లో వస్తువులా చేతులు మారిన శిశువు..!

చేవెళ్ల ఫిబ్రవరి 23: మన సాక్షి

కొడుకు మీద ఆశ, డబ్బు మీద అత్యాశ ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన ఓ ఆడపిల్ల అంగట్లో బొమ్మలా మారింది. ఈ లోకంలోకి వచ్చి 20 రోజులైనా కాకముందే శిశువు ఓ వస్తువులా చేతులు మారింది. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు కలిగిన ఓ తల్లి తన నాలుగో బిడ్డను 25వేల నగదు, తులం బంగారానికి అమ్మేసింది. ఆ పై మరో రూ.2లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బిడ్డను కొన్న వారు చేతులెత్తేయగా తిరిగి కన్న తల్లి చెంతకు చేరిన ఆ శిశువును అధికారులు శిశు విహార్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ అమానవీయ శిశు విక్రయ ఘటన చేవెళ్ల మండలం బస్తే పూర్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల మల్లేష్ సుజాత దంపతులకు 2018లో వివాహమైంది. వీరికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా కొడుకు కోసం నాలుగో సంతా నానికి సిద్ధమయ్యారు. గర్భస్థ పరీక్షల్లో మళ్ళీ ఆడపిల్ల అని తేలడంతో గర్భస్రావానికి ప్రయత్నించి వైద్యుల సూచనలతో వెనక్కి తగ్గారు.

ఈ క్రమంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిబ్రవరి 3న సుజాత ఆడ శిశువును ప్రసవించగా అంగన్వాడీ కేంద్రంలో పాప పేరు సిరి అని నమోదు చేయించారు. అయితే, పోషణ భారం మోయలేక షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల అరిటాకులకు గ్రామానికి చెందిన రామచంద్రయ్య రత్నమ్మ దంపతులకు సిరిని అమ్మేశారు.

ALSO READ : Zero bills for home electricity : గృహ విద్యుత్ కు ఇక జీరో బిల్లులు, ఎప్పటినుంచంటే.. ఆదేశించిన రేవంత్ రెడ్డి..!

వారి నుంచి రూ.25వేలు, తులం బంగారు చైన్ తీసుకుని విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే, చిన్నారి సిరి తల్లిదండ్రుల వద్ద లేదని గుర్తించిన స్థానిక అంగన్వాడీ టీచర్ స్వప్న విషయాన్ని సిడిపీవో శోభారాణి, సూపర్ వైజర్ అనురాధ దృష్టికి తీసుకెళ్లింది. మరోపక్క రామచంద్రయ్య దంపతులకు ఫోన్ చేసిన సుజాత తనకు మరో రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా గొడవ జరిగింది. చివరికి శిశు విక్రయం గురించి తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు చిన్నారి సిరిని గ్రామానికి రప్పించారు.

సిరిని అధికారికంగా దత్తత తీసుకునేందుకు రామచంద్రయ్య దంపతులు ముందుకు రాగా.. సుజాత మాత్రం రూ.2 లక్షల కోసం పట్టుబట్టింది. దీంతో సుజాత నుంచి భవిష్యత్తులో వేధింపుల ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో రామచంద్రయ్య దంపతులు శిశువును తల్లికి అప్పగించారు. కాగా, శిశువును శుక్రవారం శిశువిహార్ కు బాలల సంరక్షణ జిల్లా అధికారి దేవేందర్ చారి అప్పగించారు. సుజాత దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

ALSO READ : BIG BREAKING : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..!

మరిన్ని వార్తలు