Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిహైదరాబాద్

Hyderabad : ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్..!

Hyderabad : ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడుతున్న ముఠాను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డిసిపి కార్యాలయంలో డిసిపి సిహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు…. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లోని పద్మ శ్రీ హిల్స్ లో వనీత చౌదరి కి చెందిన 600 గజాల ప్లాట్ ఉంది. అయితే ప్రస్తుతం ఆమె తమిళనాడులో ఉంటుందని తెలి పారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఫోర్టరీ చేసి అమ్మినట్లు ఆమెకు తెలియడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు దర్యాప్తు చేయగా 15 మంది నిందితులు కలిసి ల్యాండ్ గ్రాబింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ 15 మంది నిందితులంతా 600 గజాల స్థలానికి నకిలీ పత్రం సృష్టించి ప్లాట్ యజమాని కెనడాలో ఉంటుందని, నకిలీ స్టాంపులు తయారు చేసి మూసాపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్లాటును శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డిలకు 4.26 కోట్ల రూపాయలకు విక్రయించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు.

7 మంది నిందితులు ఇమ్మానియేల్, దివాకర్ వర్మ, పాల్సన్ సుభాషిని, నాగేష్ అలియాస్ నాగేశ్వర రావు, పుష్ప కుమార్, చంద్రమో హన్, వలిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.69 కోట్ల నగదు, 3 కార్లు, ఏడు సెల్ ఫోన్లు, నాలుగు నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సకిలీ స్టాంపులు 3 కిలోల నకిలీ బంగారు బిల్లులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

MOST READ: 

  1. Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

  2. District collector : ఇందిరమ్మ ఇండ్లు మొదటి ప్రాధాన్యత వారికే.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!

  3. Galaxy Health insurance : అదిరిపోయే టాప్-అప్‌తో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..!

  4. MLC Elections : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ కైవసం..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

మరిన్ని వార్తలు