Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగు మాయం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ చోరీ.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగు మాయం..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగిన సంఘటన చోటుచేసుకుంది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 23 లక్షల బ్యాగును దుండగులు దోచుకెళ్లాడు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి పరిధిలోని జాతీయ రహదారిపై పూజిత హోటల్ వద్ద భోజనాల కోసం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపింది. ఆ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల కు చెందిన వెంకటేష్, హైదరాబాద్ వెళుతున్నాడు. అతని వద్ద 23 లక్షల రూపాయల బ్యాగు ఉంది.

కాగా ఆ బస్సు డ్రైవర్ నార్కట్పల్లి వద్ద భోజనాల కోసం ఆపడంతో వెంకటేష్ బ్యాగును బస్సు లోనే ఉంచి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. దాంతో డబ్బుల బ్యాగు గమనించిన దుండగుడు దోచుకెళ్లాడు. కాగా బాధితుడు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి కెమెరాల ఆధారంగా అనుమానితుడిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!

Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

Peddapalli : ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య..! 

చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల హతం, ఇద్దరు జవాన్లు మృతి..!

Elections : పంచాయతీలకు 300, ఎంపీటీసీ లకు 94 పోలింగ్ కేంద్రాల గుర్తింపు..!

మరిన్ని వార్తలు