Gold Medal : గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థి.. ప్రతిభకు గోల్డ్ మెడల్ దక్కింది..!

Gold Medal : గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థి.. ప్రతిభకు గోల్డ్ మెడల్ దక్కింది..!
చింతపల్లి, మన సాక్షి :
” శ్రమ నీ ఆయుధమైతే, విజయం నీ బానిస అవుతుంది ” అనే సిద్ధాంతం తో ఓ గ్రామీణ నిరుపేద విద్యార్థి కష్టపడి చదివి హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏకంగా అగ్రికల్చర్ బీఎస్సీ లో గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని తక్కల్లపల్లి గ్రామ విద్యార్థి పొగాకు శివప్రసాద్ కు దక్కింది.
వివరాల ప్రకారం చింతపల్లి మండలం పరిధిలోని తక్కల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి పొగాకు శ్రీశైలం, తల్లి సంతోష దంపతుల పెద్ద కుమారుడు పొగాకు శివప్రసాద్ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మండలంలోని కుర్మేడ్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న నవోదయ మోడల్ పాఠశాలలోప్రాథమిక విద్యనభ్యసించాడు.
ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని జాన్ పీటర్ హైస్కూల్లో చదివి ఎస్ఎస్సి లో 10/10 మార్కులు సాధించాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపిసి తీసుకొని హైదరాబాదులోని శ్రీ చైతన్య కాలేజీలో లో 986 మార్కులు సాధించాడు. ఎంసెట్లో ఏడు వేల ర్యాంకు సాధించి హైదరాబాదులోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో చేరాడు.
ఎంతో క్రమశిక్షణతో చదివి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాలలో యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా పొగాకు శివప్రసాద్ ను వారి తల్లిదండ్రులను, మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం అభినందించి సన్మాన కార్యక్రమం అందజేశారు.
ఈ సందర్భంగా గోల్డ్ మెడల్స్ సాధించిన శివప్రసాద్ ను యూనివర్సిటీ యాజమాన్యం ఎంతగానో అభినందించింది. మునుముందు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని యూనివర్సిటీ యాజమాన్యం డైరెక్టర్ మల్లారెడ్డిమాట్లాడుతూ శివప్రసాద్ మా యూనివర్సిటీలో క్రమశిక్షణతో చదివి గోల్డ్ మెడల్ సాధించి వారి తల్లిదండ్రులకు, మా యూనివర్సిటీ కి ఎంతో గర్వ కారణం తెచ్చిపెట్టారన్నారు.
నిరుపేద విద్యార్థి మా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ అందుకోవడం మాకుఎంతో గౌరవం దక్కిందన్నారు. శివప్రసాద్ మన ముందు ఉన్నత స్థానాలకు ఎదగాలని డైరెక్ట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోరారు.. అదేవిధంగా తల్లిదండ్రులను అభినందించారు, ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!
-
Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!
-
TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!









