TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!
TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!
మన సాక్షి :
ఓ ఇంటి నుంచి వింతైన వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా చెక్ చేసిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ముంతాజ్ అనే మహిళ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కల పెంపకం షురూ చేసింది. దాంతో ఆమె ఇంటి నుంచి వింతైన వాసన చుట్టుపక్కల వారికి వెళుతుంది. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకొని పరిశీలించగా ఇంటి ఆవరణలో గంజాయి మొక్కల పెంపకం చేస్తున్నట్లు తేలింది. అయితే ముంతాజ్ తాను మార్కెట్ నుంచి తెచ్చిన మొక్కలు గంజాయి అని తనకు తెలియదని, తెలియక విత్తనాలు వేశానని వివరణ ఇచ్చారు.
తనకు తెలిసిన వ్యక్తులు ఆ మొక్కలు మంచివి కాదన్నారు.. రాత్రి కదా అని పొద్దున్నే తీయాలనుకున్న, ఈ లోపేదంతా జరిగిందంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయినా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.









