Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Miryalaguda Breaking : worker died in the rice industry : రైస్ ఇండస్ట్రీ లో కార్మికుడు మృతి..!

Miryalaguda Breaking : worker died in the rice industry : రైస్ ఇండస్ట్రీ లో కార్మికుడు మృతి..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొన్నది. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెంలో రైస్ ఇండస్ట్రీలో ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలం గ్రామం సంతోష్ రైస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మిరియాల రంగయ్య (60సం) సంతోష్ రైస్ ఇండస్ట్రీలో రోజువారి కూలిగా చేస్తున్నాడు .

గురువారం ధాన్యం వెల్ వేటర్ పైన శుభ్రం చేసేందుకు మెట్ల పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారీ క్రింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు . మృతునికి భార్య , కుమారుడు , ఉన్నారు.

ALSO READ : BIG BREAKING : ఉచిత విద్యుత్, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పై రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం..!

మరిన్ని వార్తలు