జాతీయంBreaking Newsవిద్య

Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!

Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

సంక్రాంతి పండుగ తోనే శీతాకాలపు సెలవులు ముగిశాయి. పాఠశాలలో ఇప్పుడిప్పుడే సాధారణంగా నడుస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఫిబ్రవరి నెలలోకి ప్రవేశిస్తాం. కాగా ఫిబ్రవరి మాసంలో కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉన్నాయి. నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే కాకుండా చాలా సెలవులే ఉన్నాయి.

ఫిబ్రవరి మాసంలో ఎన్ని సెలవులు వస్తున్నాయో ఒకసారి చూద్దాం.. ఫిబ్రవరి నెలలో 2, 9, 16, 23 తేదీలలో ఆదివారం సందర్భంగా సెలవులు వస్తున్నాయి. అయితే ఫిబ్రవరి 15వ తేదీన రెండవ శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవే వస్తుంది.

ఇవి కాకుండా మిగతా సెలవులు ఎప్పుడు ఉన్నాయో చూద్దాం..

ఫిబ్రవరి 2 : ఈనతేదీన వసంత పంచమి, సరస్వతి పూజ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఫిబ్రవరి 14 : షబ్ ఏ బరాత్ ముస్లింలు జరుపుకునే పండుగ. ఇది పబ్లిక్ హాలిడేస్ లో ఆప్షనల్ సెలవుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ఉంటాయి.

ఫిబ్రవరి 19 : చత్రపతి శివాజీ జయంతి. ఈ ఏడాది మరాఠా చక్రవర్తి 395 వ జయంతిని జరుపుకోనున్నారు. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 24 : గురు రవిదాస్ జయంతి. ఇది మాఘ మాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. ఇతను ఉత్తర ప్రదేశ్ వారనాసిలో జన్మించాడు. ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లో సెలవులు ప్రకటిస్తారు.

ఫిబ్రవరి 26 : హిందూ మతం ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఇది శివుడికి పూజలు చేసే గొప్ప పండుగ. ఈరోజు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!

  2. PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

  5. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

మరిన్ని వార్తలు