సినిమాBreaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్
Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ పోలీసుల విచారణ..!
Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ పోలీసుల విచారణ..!
మన సాక్షి తెలంగాణ బ్యూరో :
సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ మంగళవారం ముగిసింది. మంగళవారం ఆయన తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు హాజరైన అల్లు అర్జున్ ను మధ్యాహ్నం 2:47 గంటల వరకు ప్రశ్నించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బేల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు మరోసారి విచారించాలని నోటీసు జారీ చేయడం వల్ల మంగళవారం ఆయన హాజరయ్యారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సహకరించినట్లు తెలుస్తోంది. మరోసారి విచారణకు అవసరముంటే హాజరు కావాలని పోలీసులు అల్లు అర్జున్ ను కోరినట్లు తెలిసింది.
MOST READ :









