తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్విద్య

Alumni : 50 ఏళ్ల తర్వాత కలయిక.. గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం..!

ఆర్మూర్ లో విద్యాబుద్ధులు నేర్చుకున్న పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన అపూర్వ కలయిక. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975 -76 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు.

Alumni : 50 ఏళ్ల తర్వాత కలయిక.. గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం..!

ఆర్మూర్, మన సాక్షి

ఆర్మూర్ లో విద్యాబుద్ధులు నేర్చుకున్న పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన అపూర్వ కలయిక. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975 -76 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు. పట్టణంలోని క్షత్రియ మినీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు.

50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలిసి పాత రోజుల్లో జరిగిన విద్యాభ్యాసం గురించి చర్చించుకున్నారు. ఆ రోజుల్లోనీ క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవభావం తదితర అంశాలు మాట్లాడుకున్నారు. ఆ రోజుల్లో హైయర్ సెకండరీ చదువుకుంటే సమాజంలో ఉన్న గౌరవాన్ని తెలిపారు. కుటుంబాల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ పూర్వ విద్యార్థుల్లో అనేకమంది ఉన్నత ఉద్యోగాలు సాధించి పదవి విరమణ చేశారు. కాబట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నారన్న విషయాలను స్నేహితులతో పంచుకున్నారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులందరూ ఒకే చోట కలిసి సహపంక్తి భోజనం చేసి ఆనందంగా, ఉల్లాసంగా గడిపారు.

ఈ సమ్మేళనంలో 30 మంది పూర్వ విద్యార్థులు కలిసి ఆ రోజుల్లో విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు శంకరయ్య, సుధాకర్, మార్కండేయ, రవీంద్ర మోహన్ లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇక శేషజీవితా న్ని సమాజసేవ కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుదర్శన్, రమేష్ బదామి, కర్తన్ కిషన్, మధుసూదన్, జి మోహన్, ఆనంద్ కుమార్ గుప్తా, జెస్సు వినయ్, ఎం రాజేశ్వర్, లక్ష్మణ్, ఎస్ మోహన్, డి. గంగాధర్, కే సూర్య ప్రకాష్, పి. జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి : 

Suryapet : సూర్యాపేట జిల్లాలో నకిలీ పురుగుమందుల గుట్టురట్టు..!

TG : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థ ఎత్తివేసేందుకు యత్నం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ..!

Nalgonda : నల్గొండ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!

ACB : భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారుల దాడులు..!

మరిన్ని వార్తలు