క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!

TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!

నాగర్ కర్నూల్, మన సాక్షి :

తెలంగాణలో మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. దైవదర్శనానికి వచ్చిన వివాహితపై కామందుల కన్ను పడింది. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో దారుణమైన సంఘటన జరిగింది. దైవదర్శనానికి ఓ మహిళ కుటుంబంతో రాగా అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఊరుకొండ ఆంజనేయస్వామి దేవాలయానికి ఓ కుటుంబం వచ్చింది. కుటుంబ సభ్యులంతా స్వామి వారి ముక్కులు తీర్చుకున్నారు. అంతలోనే ఆ కుటుంబంలోని ఓ మహిళ బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో బంధువును వెంటపెట్టుకొని మహిళ బహిర్భూమికి వెళ్ళింది. కానీ ఆ కుటుంబం వచ్చినప్పటి నుంచి ఆ ఊరు లోనే కొందరు వ్యక్తులు అవకాశం కోసం ఎదురు చూశారు.

మహిళ బహిర్భూమికి వెళ్లిన విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు ఆమె వెంట వెళ్లారు. ఆపై మహిళతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి మహిళను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆ కామందులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళపై ఎనిమిది మంది యువకులు అత్యాచారం చేసిన ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.

MOST READ :

  1. CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

  2. Hyderabad : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్..!

  3. Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!

  4. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  5. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

మరిన్ని వార్తలు