Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకంలో రుణమాఫీ కానీ రైతులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు సరిచేసి రుణమాఫీ అందించనున్నారు. అందుకు గాను వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేసింది.
జూలై 18వ తేదీ మొదటి విడత లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేశారు. జూలై 30వ తేదీన రెండవ విడత లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేశారు. ఆగస్టు 15వ తేదీ మూడో విడత రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారు.
కానీ రుణమాఫీ అనేకమంది రైతులకు రాలేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు.
రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రుణమాఫీ కానీ రైతులు ఫిర్యాదులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీ రెండు లక్షల లోపు రుణం ఉన్న వారందరికీ పూర్తి అయినందున.. రుణమాఫీ కానీ రైతులు వ్యవసాయ అధికారుల వద్ద ప్రత్యేక కౌంటర్లలో ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు చేసిన రైతులందరికీ స్పెషల్ వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.
ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లలో తప్పులతో పాటు ఇతర కారణాల తో రుణమాఫీ పొందని వారికి స్పెషల్ వెరిఫికేషన్ చేసి అర్హులందరికీ రుణమాఫీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ :
¤ ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!
¤ మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!
¤ Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!










