TOP STORIESBreaking Newsతెలంగాణ

TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

TG News : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఆగస్టు 22 లోపే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేయబోతుంది. ఈనెల 22వ తేదీతో శ్రావణమాసం ముగుస్తున్నందున ఆలోపే శుభవార్త తెలియజేయబోతుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన గ్రామాలలో ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను ఎక్కువగా మొదటి విడత లక్ష రూపాయల రుణం లబ్ధిదారుల ఖాతాలో పడింది. మొదటగా ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో వివిధ స్థాయిలలో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా శ్రావణమాసం లోనే ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అందుకుగాను ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గంలోని చుండ్రుగొండ గ్రామంలో 50 ఇండ్లు పూర్తయ్యాయి. దాంతో చుండ్రుగొండలో ఈనెల 22వ తేదీ లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించనున్నారు.

MOST READ : 

  1. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

  2. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

  3. Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!

  4. Sub Collector : సబ్ కలెక్టర్ కీలక ఆదేశం.. తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు