TOP STORIESBreaking News

TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో కబురు.. భరోసా కల్పించిన ప్రభుత్వం..!

TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో కబురు.. భరోసా కల్పించిన ప్రభుత్వం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ మరో కబురు తెలియజేసింది. వారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సమయానికి అందజేయడంతో పాటు ఐ ఆర్ ప్రకటించడం, బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. కాగా ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఇచ్చే అంత్యక్రియల చార్జీలను పెంచింది.

ఇప్పటివరకు అంత్యక్రియలకు గాను 20 వేల రూపాయలను ఇస్తున్నారు. కాగా దానిని 30 వేల రూపాయల పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కూడా భరోసా కల్పిస్తుంది. మరణానంతరం ఆర్థిక సహాయం, ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడుతోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు