పేదలపై మరో పిడుగు.. వంట నూనెలు మరింత పిరం..!
పేదలపై మరో పిడుగు.. వంట నూనెలు మరింత పిరం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతూ పేదలపై భారం పడుతుంది. కూరగాయల ధరల నుంచి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం మరో పిడుగు లాంటి వార్త తెలియజేసింది. పేద ప్రజలపై మరో పిడుగు పడింది.
వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ మోదీ ప్రభుత్వం ప్రకటించడంతో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెనుభారం మోపింది. మొన్నటి వరకు సాధారణంగా ఉన్న వంటనూనె ధర 20 రూపాయలకు చేరడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటరు వంటనూనెపై 15 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచడంతో సామాన్యులకు ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పటివరకు లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.115 ఉండగా ఒక్కరోజులోనే రూ.130కి చేరింది. లీటరు పామాయిల్ ధర రూ.115కు పెరిగింది.
వంటనూనెతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలను కూడా లీటరుకు 15 రూపాయలకు పైగా పెంచారు. దుకాణాల్లోనే కాకుండా ఆన్లైన్ విక్రయదారులు కూడా ధరలు పెంచారు. కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు.
పామాయిల్‌ను హోల్‌సేల్‌లో లీటరు 110 రూపాయలకు విక్రయిస్తుండగా, రిటైల్ దుకాణాల్లో లీటరుకు 115 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.140కి చేరింది. పూజలకు ఉపయోగించే లీటరు నూనె ధర 109 రూపాయలు ఉండగా ప్రస్తుతం 120 రూపాయలు పలుకుతున్నట్లు మహిళలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
-
iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!
-
E pass : ఈ పాస్ లో నమోదు చేయకుండా ఎరువులు విక్రయిస్తే చర్యలు..!
-
Good News : సింగరేణి కార్మికులకు దసరా కానుక.. భారీగా బోనస్..!
-
Jagityal : ఆంక్షలు లేకుండా రైతు రుణ మాఫీ చేయాలి.. బీఆర్ఎస్ భారీ ధర్నా..!
-
Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!










