District collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
సూర్యాపేట, మనసాక్షి :
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశమందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ బి రాంబాబుతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈరోజు జరిగిన ప్రజావాణిలో మొత్తం 50 ఫిర్యాదులు సమర్పించారని, శాఖల వారిగా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క తీమ్ “ఆరోగ్యకరమైన ప్రారంభం- ఆశాజనక భవిష్యత్తు” తల్లులు మరియు నవజాత శిశువులు ఆరోగ్యం, మనుగడను మెరుగు పరచడంపై దృష్టి పెడుతుందని కలెక్టర్ తెలిపారు.
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి బాడీ చెకప్ చేసుకోవాలని ,మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం గురించి ,గుడ్ హ్యాబిట్స్ పై ప్రజలకు తెలిసే విధంగా ప్రచార కార్య క్రమాలు నిర్వహించాలని కలెక్టర్ జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. ప్రభుత్వం కూడా ప్రజా ఆరోగ్యం పై పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టరేట్లోని అన్ని శాఖల ఉద్యోగుల కొరకు కలెక్టరేట్లో హెల్త్ క్యాంపు నిర్వహించి అందరి ఆరోగ్య పరీక్షలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండాకాలం సందర్భంగా ఎండలు బాగా ఉన్నాయని అందరూ క్యాప్స్ ధరించాలని ఎక్కువగా ఫ్లూయిడ్స్ వాడాలని ఉద్యోగులు తమ వెంట వాటర్ బాటిల్స్ తప్పక ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో చలివేంద్రల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద , పనికి ఆహర పథకం జరిగే ప్రాంతాలలో కూలీలకు తప్పక త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని హాస్టల్స్, స్కూల్స్ ,అంగన్వాడి కేంద్రాలు అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పాలన అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన మాజీ విఆర్వోలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ తెలిపారు.
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన విన్నపాలను పరిష్కరించడంలో కొన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవడం లేదని, మొత్తం జిల్లాలో ఇప్పటివరకు ప్రజావాణి ద్వారా 3462 దరఖాస్తులు రాగా వాటిలో 2780 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని 682 దరఖాస్తులు వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా డిపిఓ 89, ఎంప్లాయిమెంట్ అధికారి 22 డిటిడిఓ 13 దరఖాస్తులు పోలీసు శాఖ వారి 52 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ప్రజావాణిలో ఆరు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రజల నుండి వచ్చిన విన్నపాలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై నిషేధం కలెక్టరేట్ లోని అన్ని శాఖలు అమలు పరచాలని ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి అలాగే వన్యప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయి కావున ప్లాస్టిక్ నిషేధాన్ని అందరం అమలుపరచాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్ కుమార్, జెడ్పిసిఈఓ వివి అప్పారావు, సిపిఓ ఎల్ కిషన్, డిఎంహెచ్వో కోటాచలం, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, డిటిడిఓ శంకర్ ,డి సి ఓ పద్మ ,ఎస్సీ అభివృద్ధి అధికారి లత, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ అభివృద్ధి అధికారి జగదీష్ రెడ్డి, ఈడీఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాస్ నాయక్ ,ఇండస్ట్రియల్ అధికారి సీతారాం నాయక్ ,ఫిషరీస్ అధికారి నాగులు నాయక్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : రాంపూర్ లో దుర్గ రాజు ఇంట్లో జిల్లా కలెక్టర్ భోజనం..!
-
Miryalaguda : రాములవారి కళ్యాణంలో ముస్లిం సోదరుల ప్రసాదం పంపిణీ..!
-
Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!
-
Awesome : అద్భుతం.. గాజు సీసాలో సీత రాముల విగ్రహాలు..!
-
Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!









