TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Heater water : చలికాలం హీటర్‌ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

Heater water : చలికాలం హీటర్‌ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

మనసాక్షి :

చలికాలం వచ్చిందంటే.. స్నానం చెయ్యాలంటేనే చాలా మంది వణికిపోతారు. కొందరు వేడి నీళ్ళు ఉంటే గానీ స్నానం చెయ్యరు. పాత కాలంలో కట్టెల పొయ్యిపై వేడి నీళ్ళు కాచేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వాటర్‌ హీటర్‌ ఉంటోంది.

చలి ఎక్కువగా ఉంది కదాని.. సల సల కాగే వేడి నీళ్ళతో స్నానం చెయ్యడం…ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు పరిశోధకులు. ఏ కాలమైనా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరంలో ఉష్ణోగ్రతలు బాగుంటాయి. మరీ వేడి నీళ్ళతో స్నానం చేసేవారికి బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువ. నిజానికి చన్నీటి స్నానమే మన బాడీలోని టెంపరేచర్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. అందుకే మన పూర్వికులు ఎక్కువగా చల్లటి నీళ్ళతోనే స్నానాలు చేసేవారు.

మాటలు కూడా రాని మూడేళ్ళలోపు పిల్లలకు కూడా మరీ చల్లగా…మరీ వేడిగా లేకుండా గోరు వెచ్చగా ఉన్న నీటితోనే స్నానం చేయించాలి. పిల్లలు చలితో వణికిపోతున్నారని వేడి నీల్లతో స్నానం చేయిస్తే.. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

నిజానికి ఒక రిసెర్చ్‌ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి.. మూడు నాలుగేళ్ళు వచ్చే వరకు చలి ప్రభావం ఉండదట. అందుకే వారికి మామూలు నీళ్ళతోనే స్నానం చేయించాలంటున్నారు నిపుణులు.
ఇక వాటర్‌ హీటర్‌ విషయానికి వస్తే..

వాటర్‌ హీటర్‌తో వేడి చేసే నీటిలో రసాయనాలు కలిసి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఎలక్టిక్‌ హీటర్‌తో వేడి చేసిన నీటిని స్నానానికి వాడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ నీళ్ళతో స్నానం చెయ్యడం వల్ల స్కిన్‌ ఎలర్జీలు వస్తాయి. హీటర్‌తో నీళ్ళు వేడి చేసేటప్పుడు కార్బన్‌ మోనాక్సైడ్‌ నీటిలో కలుస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. తలనొప్పి, వాంతులకు కార్బన్‌ మోనాక్సైడ్‌ కారణమవుతుంది.

అందుకే చలి కాలమే కాదు.. ఏ కాలమైనా… అంతగా వేడి నీటితోనే స్నానం చెయ్యాలనుకుంటే…వాటర్‌ హీటర్‌ బదులు ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌పై కాచిన నీటిని స్నానానికి వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Reporting :

MahipalReddy, Hyderabad

MOST READ : 

 

మరిన్ని వార్తలు