TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా కు మీరు అర్హులేనా.. నిబంధనలు ఖరారు..!

Rythu Bharosa : రైతు భరోసా కు మీరు అర్హులేనా.. నిబంధనలు ఖరారు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు అయినట్లు సమాచారం. గతంలో ఉన్న రైతుబంధు స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసాను తీసుకురానున్నది.

రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10వేల రూపాయల పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా గత ప్రభుత్వం అందజేసింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చి ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి పది మాసాలు గడుస్తున్నా.. రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు .గత యాసంగి సీజన్ లో పాత పద్ధతి ద్వారానే రైతుబంధు పథకం అమలు చేశారు. వానాకాలం సీజన్నలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కానీ రైతుబంధు పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు కూడా పెట్టుబడి సహాయం గత ప్రభుత్వం అందజేసినట్లుగా నిర్ధారించుకుంది.

దాంతో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలలో రైతులతో చర్చ నిర్వహించారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ రైతు బంధు, రుణమాఫీ వల్ల ఆలస్యమైంది. కాగా ఈ సీజన్ ఇప్పటికే సగం పూర్తయినందున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి విధివిధానాలు ఖరారు చేసినట్లు సమాచారం.

ఎకరానికి 15000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని రెండు విడతలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.20 ఎకరాలను కటాఫ్ గా నిర్ణయించినట్లు సమాచారం. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ప్రభుత్వం లాగా ప్రభుత్వ సొమ్ము దుబారా చేయకుండా సాగు చేసే భూములకు రైతు భరోసా అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను 7.20 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందజేయాలని నిర్ణయించారు.

రైతు రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా అందజేయనున్నారు. దసరా పండుగ లోపు రుణమాఫీ కానీ రైతులకు ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించింది. కాగా దసరా వెళ్ళిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులు కూడా రైతులకు వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు