TOP STORIESBreaking Newsజాతీయం

Dolo 650 : జ్వరం వచ్చిందని డోలో 650 వేసుకుంటున్నారా.. అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

Dolo 650 : జ్వరం వచ్చిందని డోలో 650 వేసుకుంటున్నారా.. అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

మన సాక్షి, వెబ్ డిస్క్;

సామాన్యులకు కూడా తెలిసిన వైద్యం ఒక్కటే. శరీర ఉష్ణోగ్రత పెరగడం.. జ్వరం వచ్చిందని భావిస్తారు. ఏ డాక్టర్ ని కూడా సంప్రదించకుండా మనకు తెలిసిన వైద్యం చేసుకుంటారు. ముందస్తుగా ఇళ్లలో డోలో 650, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్స్ మన దగ్గర పెట్టుకుంటాం.

మనదేశంలో జ్వరం వస్తే డోలో 650, పారాసెటమాల్ మందులనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇవి చాలామందికి సుపరిచితమే. డోలో 650 అనేది పారాసిటమల్ అనే రసాయనం నుండి తయారవుతుంది. ఇది తలనొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వివిధ రకాల నొప్పులను కూడా తగ్గించడానికి ఉపయోగిస్తారు.

ఇవి వేసుకోవడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే డోలో 650 వేసుకోవడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జలుబు లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది.

అయితే కొంతమందికి ఇది వేసుకోవడం వల్ల మైకం రావడం, వికారం అనిపించడం, అజీర్ణం అలర్జీ చర్యలు కనిపిస్తాయి. ఇంకా మరి కొంత మందికి కాలేయం, మూత్రపిండాల సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. చర్మం ఎర్రబడడం వస్తుంది.

అయితే ఈ దుష్ప్రభావాలు అందరిలోనూ కనిపించవు. కొందరికీ మాత్రమే తీవ్రమైనవిగా కనిపిస్తాయి. వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. నిర్దేశించిన మోతాదును మించి తీసుకోకూడదు. గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకున్న తర్వాతనే ఈ టాబ్లెట్లు వినియోగించాలి.

అంతేకాకుండా ఇతర మందులు వేసుకునే వారు సైతం వాటితో కలిపి ఈ టాబ్లెట్లు వేసుకునే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది అని డాక్టర్లు చెబుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు