District collector : ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యాచరణ ప్రణాళిక ప్రాజెక్ట్ ప్రతిపాదనను రూపొందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ఆస్పిరేషనల్ బ్లాక్స్ కార్యాచరణ ప్రణాళిక ప్రాజెక్ట్ ప్రతిపాదనను రూపొందించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్ (నర్వ మండలం) కార్యాచరణ ప్రణాళిక/ప్రాజెక్ట్ ప్రతిపాదనను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో నర్వ మండలం ఆస్పిరేషన్ బ్లాక్ డీ పీ ఆర్ (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)పై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్వ బ్లాక్‌లో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక అభివృద్ధి రంగాలలో కీలకమైన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ సూచికల ప్రకారం వంద శాతం సంతృప్తిని సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఈ కీలకమైన రంగాల సమగ్ర కవరేజ్ మరియు మెరుగుదలను నిర్ధారించడం లక్ష్యంగా కేంద్రీకృత ప్రయత్నం చేయాలన్నారు.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద, నీతి ఆయోగ్ కేపీఐలపై బ్లాక్‌ల పురోగతిని పర్యవేక్షిస్తుందని, అలాగే ఛాలెంజ్ పద్ధతి ద్వారా ర్యాంకులు పొందిన బ్లాక్‌లకు పనితీరు ఆధారిత అవార్డులను అందిస్తుందన్నారు. గత నెల ఏప్రిల్ నెలలో నీతి ఆయోగ్ కేపీఐ పనితీరు ఆధారంగా సెప్టెంబర్-డిసెంబర్, 2024 క్వార్టర్ డెల్టా ర్యాంకింగ్‌ను విడుదల చేసిందని, సెప్టెంబర్-డిసెంబర్, 2024 క్వార్టర్ డెల్టా ర్యాంకింగ్‌లో నర్వ బ్లాక్ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్‌ను పొందడం మన మంచి పనితీరుకు నిదర్శనం అన్నారు.
డెల్టా ర్యాంకింగ్ ఆధారంగా నీతి ఆయోగ్ అభివృద్ధి పనుల కోసం నర్వ బ్లాక్‌కు రూ.1.5 కోట్లు మంజూరు చేసిం దన్నారు. పథకం మార్గదర్శకాల ప్రకారం, జిల్లాకు కేటాయించిన నిధుల కోసం రాష్ట్ర నోడల్ అధికారితో సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక/ప్రాజెక్ట్ ప్రతిపాదనను రూపొందించాలని ఆమె పునరుద్ధరించారు.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేయబడిన కార్యదర్శుల సాధికార కమిటీ తుది ఆమోదం కోసం దానిని నీతి ఆయోగ్‌కు పంపాల్సి ఉంటుందని, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక అభివృద్ధి అనే ఐదు రంగాలలో దేనిలోనైనా ఈ ప్రాజెక్టును రూపొందించవచ్చని ఆమె తెలిపారు.
కాగా ఇదే అంశమై కార్య ప్రణాళిక/ప్రాజెక్ట్ ప్రతిపాదన తయారీ కోసం కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్ వార్ తో కలిసి జిల్లా అధికారులు, నర్వ మండల అధికారులతో బ్లాక్‌లోని ప్రధాన సవాళ్లు అవసరాలను చర్చించారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఈ నెల 25 వరకు సిద్ధం చేసి, నీతి ఆయోగ్‌కు సమర్పించాల్సి ఉంటుందని, అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి గురువారం సాయంత్రం వరకు తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మోహన్, డాక్టర్ శైలజా,వైద్య శాఖ డీ పి వో బిక్షపతి, జిల్లా పశువైద్య అధికారి, నర్వ ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో అఖిల, సిడిపిఓ, మిషన్ భగీరథ, భూగర్భ జల వనరుల శాఖ ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
SSC : పదవ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్.. పేరెంట్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్..!
-
NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!








